HomeTelugu Big Storiesకుమారి ఆంటీకి .. రాజకీయాలకు సంబంధం ఏంట్రా బాబు?

కుమారి ఆంటీకి .. రాజకీయాలకు సంబంధం ఏంట్రా బాబు?

kumari auntyఫుట్ పాత్ పక్కన అత్యంత తక్కువ ధరకే ఫుడ్ విక్రయిస్తూ కుటుంబ పోషణ జరుపుకుంటున్న వారిలో కుమారి ఆంటీ ఒకరు. అయితే ఈమెకు ఇటీవలే సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ వచ్చింది. కొందరు పాజిటీవ్‌గా వీడియోలు చేస్తుంటే.. మరికొందరూ నెగిటీవ్‌గా చూపిస్తున్నారు. ఏదేమైనా ఈ ఆంటీకి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ఆమె దగ్గర ఫుడ్‌ టేస్ట్ చేయడం కోసం ఇతర ప్రాంతల నుండి కూడా వస్తున్నారు.

దీంతో కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ ఎంతో ఫేమస్ అయింది. ఈ క్రమంలో ఒక్కసారిగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆమెకు షాక్‌ ఇచ్చారు. ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోందని కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ ను పోలీసులు మూసివేయించిన విషయం తెలిసిందే. దీనికి యూట్యూబర్లు, మీడియానే కారణమని నెటిజన్లు మండిపడుతుండగా.. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఎందుకు మూసివేయించారో తెలియట్లేదని కుమారి ఆంటీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. ఆమె అదే ప్రాంతంలో ఫుడ్ స్టాల్ పెట్టుకునేందుకు అనుమతులు జారీ చేయాలని సూచించారు. ఈక్రమంలో మరో కొత్త రచ్చ జరుగుతుంది. ఏపీలో పార్టీల మధ్య వివాదం రేపింది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనపై ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో గొడవపడుతున్నారు.

కుమారి ఆంటీ ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు వలస వచ్చారు. ఇక్కడ చిన్నగా ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. ఏపీ సీఎం జగన్ వల్ల తనకు ఏపీలో ఓ ఇల్లు ఏర్పడిందని గతంలో కుమారి ఆంటీ మీడియాకు చెప్పారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే ఆమె ఫుడ్ సెంటర్ మూతపడేందుకు కారణమైందని వైసీపీ ఆరోపిస్తోంది. జగన్ కు అనుకూలంగా మాట్లాడిందనే కోపంతో తెలంగాణ ప్రభుత్వాన్ని ఉసిగొల్పి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు కుమారి ఆంటీపై కక్ష సాధించారని ఆరోపించింది. కుమారి ఆంటీకి .. రాజకీయాలకు సంబంధం ఏంట్రా బాబు అని నెటిజన్లు తలపట్టుకుంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!