HomeTelugu Trending'ఖుషి' టైటిల్‌ సాంగ్‌ వచ్చేసింది

‘ఖుషి’ టైటిల్‌ సాంగ్‌ వచ్చేసింది

Kushi Title Song

టాలీవుడ్‌ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ స్టార్‌ హీరోయిన్‌ సమంత జంటగా నటిస్తున్న చిత్రం ఖుషి. శివ‌నిర్వాణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ఖుషి నువ్‌ కనబడితే.. ఖుషి నీ మాట వినబడితే అంటూ సాగే ఈ పాటను శివనిర్వాణ రాశాడు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ హేశమ్‌ అబ్ధుల్‌ వహబ్‌ కంపోజిషన్‌లో స్వయంగా పాడాడు. అందమైన లొకేషన్లలో లవ్‌ ట్రాక్‌తో సాగుతున్న ఈ పాటకు బృందామాస్టర్ డాన్స్‌ కంపోజ్‌ చేశారు. సినిమాకే ఈ పాట హైలెట్‌గా నిలిచిపోయేలా అనిపిస్తుంది. బ్లూ డ్రెస్‌లో విజయ్ దేవరకొండ, ఏంజెల్‌ లుక్‌లో సామ్ కనిపిస్తూ.. ఏ మాయ చేశావే రోజులను మరోసారి గుర్తు చేస్తున్నారు. ఖుషి నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు,పాటలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఖుషి చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యానర్‌లో రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రంలో స‌చిన్ ఖ‌డేక‌ర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, ల‌క్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, కన్నడ యాక్టర్‌ జ‌య‌రాం, శ‌ర‌ణ్య ప్రదీప్‌ కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 1న సినిమా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!