‘లచ్చి’ టీజర్ లాంచ్!

యాంకర్ గా ప్ర‌తి ఇంటి ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌ర‌య్యిన జ‌య‌తి మెట్ట‌మెదటిసారిగా హీరోయిన్ గా న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్రం ల‌చ్చి. J9 4షోస్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఈశ్వ‌ర్ అనే ద‌ర్శ‌కుడు ప‌రిచ‌యం అవుతున్నాడు. షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న‌ ఈ చిత్రం అక్టోబ‌ర్ లో విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించి మెద‌టి లుక్ టీజ‌ర్ ని ఆదివారం తెలంగాణా  అధికార ప్ర‌తినిధి ఎస్‌.వేణుగోపాలా చారి గారి చేతుల మీదుగా విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా..
ఎస్‌.వేణుగోపాలా చారి మాట్లాడుతూ… ”తెలంగాణా ఊర్ల‌లో ల‌చ్చి అని పిల‌వ‌టం అల‌వాటు.. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కూడా పిలుస్తారు. అలాంటి నానుడి వున్న టైటిల్ ని పెట్టినందుకు జ‌య‌తి ని అభినందించాలి. ఈ చిత్రంలో న‌టించిన వారంద‌రి నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను” అని అన్నారు.
నిర్మాత‌, క‌థానాయిక జ‌య‌తి మాట్లాడుతూ.. “చాలా టీవి ప్రోగ్రామ్స్ ప్రోడ్యూస్ చేసిన అనుభవంతో మెట్ట‌మెద‌టిసారిగా సినిమా నిర్మాణం చెపట్టాను. అలాగే ఈ చిత్రం క‌థ న‌చ్చి నేను మెయిన్ లీడ్ పాత్ర‌లో న‌టించాను. హ‌ర్ర‌ర్ కామెడి జోన‌ర్ లో కొత్త జోన‌ర్ లో ఈ చిత్రాన్ని చేశాము. మా చిత్రానికి ల‌చ్చి అనే టైటిల్ ని ఖ‌రారు చేశాము. ఈ చిత్రం అంతా ల‌చ్చి పాత్ర చుట్లూనే తిరుగుతుంది. అతి త్వ‌ర‌లో సురేష్ యువ‌న్ అందించిన ఆడియో ని విడుద‌ల చేస్తాము. అక్టోబ‌ర్ లో చిత్రాన్ని విడుదల చేయ‌టానికి
స‌న్నాహ‌లు చేస్తున్నాము” అని అన్నారు.
 
CLICK HERE!! For the aha Latest Updates