HomeTelugu Trendingఏపీ ఎన్నికలపై లగడపాటి ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ ఎన్నికలపై లగడపాటి ఆసక్తికర వ్యాఖ్యలు

18

ఎన్నికల సర్వేలలో ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుతెచ్చుకున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సర్వేలో మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా వచ్చాయి. దాంతో కాస్త సైలెంట్ అయిన లగడపాటి మళ్లీ రాబోయే ఎన్నికలపై తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏప్రిల్‌ 11న ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదని, ఏదో ఒక పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుందని తెలిపారు.

పోలింగ్‌ ముగిసిన తర్వాతే తన సర్వే ఫలితాలను వెల్లడిస్తానని లగడపాటి చెప్పారు. ప్రత్యేక హోదా అనేది ఈ ఎన్నికల్లో ఒక అంశం మాత్రమేనని చెప్పారు. వైరుధ్యాలున్న నేతలను చంద్రబాబు ఏకతాటిపైకి తేవడం మంచిపరిణామం అని అన్నారు. ఎల్లప్పుడూ వైషమ్యాలతో ఉండాలని ఎవరూ కోరుకోరని అన్నారు. ఈ ఎన్నికల్లో తాను ఎక్కడా పోటీ చేయబోనని, ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటానని స్పష్టంచేశారు. విభజన తర్వాత రాష్ట్రం అనేక కష్టాలను ఎదుర్కొందని, ఆర్థికలోటులోనూ అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని లగడపాటి వ్యాఖ్యానించారు.

కొద్ది కాలంగా ల‌గ‌డ‌పాటి ఏపి సీఎం చంద్ర‌బాబు తో స‌న్నిహిత సంబంధాలు కొన‌సాగిస్తున్నారని, పార్టీ వ్యూహాలు, నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ స్థితి గతులపై ఎప్ప‌టిక‌ప్ప‌డు నివేదిక‌లు అందిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పారిశ్రామిక వేత్త అయిన ల‌గ‌డ‌పాటి ఈ మ‌ధ్య కాలంలోనే ఏపి ప్ర‌భుత్వం నుండి ఓ ప్రాజెక్ట్ కూడా ద‌క్కించుకున్న‌ట్లు ప్ర‌చారం. ఈ సారి ఎన్నిక‌ల్లోనూ టీడీపీ తిరిగి అధికారంలోకి రావాల‌ని ల‌గ‌డ‌పాటి కోరుకుంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu