HomeTelugu Newsలక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల మార్చిలోనే..!

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల మార్చిలోనే..!

8 18
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలోని ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను ఇటీవలే రిలీజ్ చేశారు. సినిమాలో అన్నీ నిజాలే చెప్తామని చెప్పిన వర్మ, వరసగా ఫొటోలను రిలీజ్ చేస్తూ హైప్, క్యూరియాసిటీని పెంచాడు. గతంలో ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామని చెప్పినా.. కొన్ని కారణాల వలన సినిమాను ఫిబ్రవరి నుంచి మార్చికి పోస్ట్‌ఫోన్ చేశారు. ఫిబ్రవరిలో టీజర్ ను రిలీజ్ చేస్తారట. మార్చిలో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటి వరకు దర్శక నిర్మాతలు ఎవరూ స్పందించకపోవడం విశేషం. సినిమాను మార్చికి పోస్ట్ ఫోన్ చేయడం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని నిర్మాత రాకేష్ రెడ్డి తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu