HomeTelugu Trending'లాల్‌సలామ్‌' న్యూ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘లాల్‌సలామ్‌’ న్యూ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Lal salaam new release da

సూపర్ స్టార్ రజినీకాంత్‌ ప్రధాన పాత్రలో న‌టిస్తున్న తాజా చిత్రం ‘లాల్‌సలామ్‌’. రజినీ కూతురు ఐశ్వర్య డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో విష్ణువిశాల్‌, విక్రాంత్‌ ,టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇప్ప‌టికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాను మొదటిగా సంక్రాంతికి విడుదల చేయాలి అనుకున్నారు. అయితే కొన్ని కారణల కారణంగా వాయిదా పడింది. దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించ‌న‌ప్ప‌టికి తాజాగా విడుద‌ల తేదీ వాయిదా వేసుకున్నట్లు వెల్లడించింది.

ఈ మూవీకి సంబంధించి కొత్త విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 09 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. ఇక గతేడాది రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించిన విష‌యం తెలిసిందే. దీంతో ‘లాల్ సలామ్’పై మంచి అంచనాలు ఉన్నాయి.

లైకా ప్రోడ‌క్ష‌న్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్, సెంథిల్, జీవిత, తంబి రామయ్య, అనంతిక సనీల్‌కుమార్, వివేక్ ప్రసన్న, మరియు తంగదురై ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu