HomeTelugu Trendingబాక్సాఫీసును షేక్ చేస్తున్న లియో మూవీ

బాక్సాఫీసును షేక్ చేస్తున్న లియో మూవీ

Leo record collections 1

హీరో విజయ్ తాజా చిత్రం లియో సినిమా మొదటి రోజు కలెక్షన్లు అదరగొట్టేశాయి. శుక్రవారం విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. కోలీవుడ్‌లోఈ మూవీ పలు రికార్డులను క్రియేట్ చేసింది.

అడ్వాన్స్ బుకింగ్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన లియో మూవీ విడుదలైన తొలిరోజు 140 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. తెలుగులోనూ లియో మూవీకి గ్రాండ్ ఓపెనింగ్స్ లభించాయి.

విజయ్ నటించిన లియో మూవీ నార్త్ అమెరికాలో టాప్‌గా నిలిచింది. లియోతో పాటు విడుదలైన అన్ని సినిమాలకంటే ఈ మూవీ అత్యధిక వసూళ్లు రాబట్టింది. కోలీవుడ్ మూవీ ఓవర్సీస్‌లో ఇలా టాప్‌వన్‌లో నిలవడం చాలా అరుదు అంటూ ట్విట్టర్‌లో పలువురు పోస్టులు పెడుతున్నారు. ఇప్పటి వరకు లియో టీమ్ అధికారికంగా కలెక్షన్ల గురించి ప్రకటన చేయలేదు.

విడుదలకు ముందు అనేక వివాదాల్లో చిక్కుకున్న లియో మూవీ తొలిరోజు తెల్లవారుజామున షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. రికార్డులు సృష్టిస్తున్న లియో మూవీకి సంబంధించి టీమ్ అంతా పండగ చేసుకుంటున్నారు.

లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో రూపొందిన లియో మూవీలో విజయ్ సరసన త్రిష నటించింది. ఇంకా సంజయ్ దత్, అర్జున్ వంటి పెద్ద స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu