HomeTelugu Trendingరామ్‌ 'రెడ్‌'లో హెబ్బా పటేల్ ఐటమ్‌ సాంగ్‌

రామ్‌ ‘రెడ్‌’లో హెబ్బా పటేల్ ఐటమ్‌ సాంగ్‌

3 3
‘ఇస్మార్ట్ శంకర్’ ఇచ్చిన హిట్‌తో మంచి జోష్‌ మీదున్నాడు ఎనర్జిటిక్ హీరో రామ్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘రెడ్’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే ఇటలీలో షూటింగ్ పూర్తి చేసుకుంది రెడ్ టీమ్. ఇప్పుడు హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుతుంది. ఈ సినిమాలో ఐటమ్‌ సాంగ్‌లో ‘కుమారి 24’ సినిమాలో నటించిన హెబ్బా పటేల్ రామ్ తో చిందేయనుందట. ఇటీవలే విడుదలైన నితిన్ భీష్మ సినిమాలో ఆమె ఓ చిన్న పాత్ర చేసింది. ఆ పాత్ర దాదాపుగా వ్యాంపు క్యారెక్టర్ అంటే అతిశయోక్తి కాదు. హీరోయిన్ గా రాణించలేక పోతుండటంతో ఇలా ఐటమ్‌ గార్ల్‌గా అవతారం ఎత్తింది. రెడ్ కు తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu