జీవితం పెర్‌ఫ్యూమ్‌లాంటిది.. శ్రుతిహాసన్ కొత్త ఫిలాసఫీ

చాలా కాలం తర్వాత శ్రుతిహాసన్ రెండు సినిమాలకు సంతకం చేసింది. హిందీలో పవర్‌, తమిళంలో లాభం సినిమాలతో బిజీగా ఉంది. సినీ నటి శ్రుతి హాసన్‌ లండన్‌కు చెందిన థియేటర్‌ ఆర్టిస్ట్‌ మైఖెల్‌తో ప్రేమలో ఉండి ఆ తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే. ఇద్దరూ పరస్పరం చర్చించుకునే ఈ నిర్ణయానికి వచ్చామని వెల్లడించారు. అయితే శ్రుతి
తీసుకున్ననిర్ణయంపై ఆమె సన్నిహితులు, స్నేహితులు షాకయ్యారట. ఈ విషయం గురించి శ్రుతి ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

శ్రుతి ఇప్పుడు సింగిల్‌గా హ్యాపీగానే ఉన్నానంటోంది. మైఖెల్‌తో బ్రేకప్ అయ్యానని తెలీగానే చాలా మంది శ్రుతి ఇలాంటి నిర్ణయం తీసుకుందేంటి అని షాకయ్యారు. కానీ నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయం ఇదే. నాకు నా సంతోషమే ముఖ్యం. జీవితం పెర్‌ఫ్యూమ్‌లాంటిది. ఒకేసారి ఎక్కువ పెర్‌ఫ్యూమ్‌ వాసనలు చూసేస్తే ఏది ఏ వాసనో తెలీదు. జీవితం
కూడా అంతే. ఏది ఎలా జరగాలన్నది మనం నిర్ణయించలేం అని వెల్లడించింది శ్రుతి.