బీహార్‌లో బాలయ్య యాక్షన్ సీన్‌

నందమూరి బాలకృష్ణ తన తర్వాతి సినిమా కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా చర్చలు జరుగుతున్న ఈ సినిమాను అనేక తర్జన భర్జనల తర్వాత ఫైనల్ చేశారు బాలయ్య. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించారు. తాజా సమాచారం మేరకు జులై 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించి బీహార్‌లో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య డబుల్ రోల్ చేస్తున్నారట. వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రం విడుదల చేయాలని నిర్మాతలు అనుకుంటున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియా రొమాన్స్ చేయబోతున్నట్లు సమాచారం. గతంలో చెన్నకేశవరెడ్డి, గౌతమి పుత్ర శాతకర్ణి, పైసా వసూల్ చిత్రంలో ఈ భామ బాలయ్యతో నటించి అలరించిన సంగతి తెలిసిందే.