
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాధ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఒక్క ట్రైలర్‌తోనే లైగర్ సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పడింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. ఈక్రమంలో మేకర్స్ వరుస అప్‌డేట్ ఇస్తున్నారు. తాజాగా మేకర్స్ మరో అప్‌డేట్‌ను ప్రకటించారు.
ఈ చిత్రంలోని ‘ఆఫాట్’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోకి ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ పాట ఫుల్ లిరికల్ వీడియో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు విడుదల కానుంది. ఈ సినిమాలో అనన్యపాండే హీరోయిన్‌గా నటించింది. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించాడు. కరణ్‌జోహర్, ఛార్మీతో కలిసి పూరి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
#Aafat promo #FirstOnTwitter @TheDeverakonda @ananyapandayy 💞
Song Tomorrow at 4 PM!#Liger #LigerOnAug25th pic.twitter.com/SAieAosyuQ
— Charmme Kaur (@Charmmeofficial) August 4, 2022













