తొలి పాన్‌ ఇండియా చిల్డ్రన్‌ మూవీగా లిల్లీ.. ట్రైలర్‌ విడుదల

ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా హావ కొనసాగుతుంది. ఇప్పటికే పీరియాడిక్‌, యాక్షన్‌తోపాటు పలు జోనర్లలో పాన్ ఇండియా చిత్రాలు మార్కెట్‌లో సందడి చేశాయి. అయితే తొలిసారి చిన్నపిల్లలపై పాన్ ఇండియా మూవీ వస్తోంది. శివమ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా పేరు ‘లిల్లీ’. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ రోజు విడుదల చేశారు. బేబీ నేహా ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ పోషిస్తోంది.

ఈ చిత్రం లిల్లీ అనే చిన్నారి చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కనున్నట్టు ట్రైలర్‌ తో చెప్పాడు దర్శకుడు. చిన్నారులను ఆకట్టుకునే అన్ని ఎలిమెంట్స్‌ తో సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్‌ ద్వారా తెలుస్తుంది. ప్రణీతరెడ్డి, వేదాంత్‌ వర్మ, రాజ్‌వీర్‌, మిచెల్లీ షా, రాజీవ్ గోవింద పిళ్లై, శివకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లిల్లీ చిత్రాన్ని గోపురం స్టూడియోస్‌ బ్యానర్‌పై కే బాబు రెడ్డి, జీ సతీశ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. లిల్లీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates