HomeTelugu Trending'లవ్‌ స్టోరీ' విడుదల తేదీ ఫిక్స్

‘లవ్‌ స్టోరీ’ విడుదల తేదీ ఫిక్స్

Love story Release Date

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో,హీరోయిన్‌లుగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘లవ్ స్టోరీ’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 16న థియేటర్లలో సందడి చేయాల్సింది. కానీ కరోనా, లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ప్రేక్షకులు ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు.

ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా విడుదలపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రం సెప్టెంబర్ 10 న విడుదల అవుతుందంటూ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా పాటలు పెద్ద హిట్ అయ్యాయి. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది.మేకర్స్ త్వరలో సినిమా ప్రమోషన్లను ప్రారంభిస్తారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ తేదీని కూడా ప్రకటిస్తారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu