‘మహర్షి’ టికెట్‌ ధరలు పెంపు!

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు నటించిన 25వ సినిమా ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక పాత్ర పోషించారు. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు కూడా ఆకట్టుకున్నాయి. మే 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. కాగా ‘మహర్షి’ సినిమా టికెట్‌ ధరలను పెంచారు. హైదరాబాద్‌లోని పలు థియేటర్ల యాజమాన్యాలు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో రూ.80 టికెట్‌ ధరను రూ.110కి పెంచారు. మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పై రూ.50 పెంచారు. ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో రూ.138 ఉన్న టికెట్‌ ధరను రూ.200కి పెంచారు. ప్రభుత్వం అనుమతితోనే ధరలు పెంచినట్లు యాజమాన్యాలు పేర్కొన్నాయి. రెండు వారాలపాటు ఈ ధరలు అమలులో ఉంటాయని తెలిపారు.

రోజుకు ఐదు షోలు..
మరోపక్క తెలంగాణలో ఈ సినిమా ఐదు షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో మే 9 నుంచి మే 22 వరకు ఐదు షోలను ప్రదర్శించబోతున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates