చిరు షోకి రేటింగ్స్ లేవట!

అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్ షో బుల్లితెరపై సంచలనాలు సృష్టించింది. ఏ టీవీ చానల్ కు రానన్నీ రేటింగ్స్ ఈ షో ద్వారా మాటీవీ దక్కించుకుంది. అయితే తొలిసీజన్ తో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ షో రెండో సీజన్ లో మాత్రం తన జోరు తగ్గించింది. నాగార్జునకు కూడా ఈ షో నుండి విరామం తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. దీంతో తరువాత సీజన్ కు నాగ్ కు బదులుగా మెగాస్టార్ ను రంగంలోకి దింపారు. చిరు ఎంట్రీతో రేటింగ్స్ బద్దలవుతాయని భావించిన యాజమాన్యానికి పెద్ద షాక్ తగిలింది.
రేటింగ్స్ సంగతి పక్కన పెడితే కనీసం టాప్ 5 ప్రోగ్రామ్స్ లో కూడా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ లేకపోవడం గమనించిన యాజమాన్యం ఒక్కసారిగా షాక్ అయినట్లు తెలుస్తోంది. తొలి స్థానంలో ఎన్టీఆర్ ‘జనతాగ్యారేజ్’ సినిమా ఉండగా.. తరువాత నాలుగు స్థానాల్లో టీవీ సీరియల్స్ నిలిచాయి. ఖైదీ రీఎంట్రీతో ఇండస్ట్రీను షేక్ చేసిన చిరు ‘ఎంఈకే’ షో ను కూడా కుమ్మేస్తాడనుకుంటే మొత్తం రివర్స్ అయింది. 
 
 
Attachments