HomeTelugu News'మా నీళ్ల ట్యాంక్‌' వెడ్‌ సిరీస్‌ ట్రైలర్‌

‘మా నీళ్ల ట్యాంక్‌’ వెడ్‌ సిరీస్‌ ట్రైలర్‌

Maa neella tank trailer
టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ ‘మా నీళ్ల ట్యాంక్‌’ అనే వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలో అడుగుపెట్టబోతున్నాడు. వరుడు కావలెను ఫేమ్‌ లక్ష్మీ సౌజన్య డైరెక్ట్‌ వస్తున్న ఈ సిరీస్‌లో ప్రియా ఆనంద్‌ హీరోయిన్‌గా నటించింది. సుదర్శన్‌, ప్రేమ్‌ సాగర్‌, దివి, రామరాజు, అన్నపూర్ణమ్మ, నిరోషా, అప్పాజీ అంబరీష ముఖ్యపాత్రలు పోషించారు. శుక్రవారం సాయంత్రం మా నీళ్ల ట్యాంక్‌ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ను పూజా హెగ్డే విడుదల చేసింది.

ఈ ట్రైలర్‌లో దాదాపు అందరూ రాయలసీమ యాస మాట్లాడటాన్ని బట్టి ఇది రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కినట్లు తెలుస్తోంది. పారిపోయిన అమ్మాయిని వెతికి తీసుకొచ్చేదాకా నీళ్ల ట్యాంక్‌ దిగనని మొండికేస్తాడో కుర్రాడు. దీంతో పోలీస్‌ పాత్రలో ఉన్న హీరో అందుకోసం గాలింపు చేపడతాడు. ఈ క్రమంలో ఆమెతో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. మరి వీరి ప్రేమ సఫలమైందా? ఇంతకీ ట్యాంక్‌ ఎక్కి కూర్చున్న వ్యక్తిని ఎలా కిందకు దించారు? అనేది తెలియాలంటే ఈ నెల 15 వరకు ఆగాల్సిందే! ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5లో తెలుగు, తమిళ భాషల్లో మా నీళ్ల ట్యాంక్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!