త్వరలోనే ‘యమన్’ పాటలు!

విజయ్‌ ఆంటోని హీరోగా మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌, ద్వారకా క్రియేషన్స్‌ పతాకాలపై జీవశంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘యమన్‌’ చిత్రాన్ని మిర్యాల రవీందర్‌రెడ్డి తెలుగులో అందిస్తున్నారు. ఫిబ్రవరి 11న ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ చాలా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. 
 
ఈ సందర్భంగా నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ – ”ఇటీవల విడుదలైన టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. విజయ్‌ ఆంటోనిగారికి బిచ్చగాడు ఎంత పేరు తెచ్చిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు యమన్‌ చిత్రం బిచ్చగాడు కంటే పెద్ద హిట్‌ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌తో వున్నాం. ఫాదర్‌ సెంటిమెంట్‌తో పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఔట్‌ అండ్‌ ఔట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘యమన్‌’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో లైకా ప్రొడక్షన్‌ వంటి బిగ్‌ బ్యానర్‌లో అసోసియేట్‌ అయి తెలుగులో ఈ చిత్రాన్ని అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్రం ఆడియోను ఫిబ్రవరి 11న చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం” అన్నారు.