‘నోరు జారాడు.. చర్యలు తీసుకోండి’..నడిగర్‌ సంఘానికి ‘మా’ లేఖ

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళ కమెడియన్‌ మనోజ్‌ ప్రభాకర్‌పై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మనోజ్‌.. ఫేస్‌బుక్‌ పోస్ట్‌తో పాటు ఓ వీడియో సందేశం రూపంలో క్షమాపణ కోరినా.. అభిమానులు శాంతించటం లేదు. తాజాగా ఈ వివాదం పై మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్ కూడా తీవ్రంగా స్పందించింది.

సూపర్‌ స్టార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మనోజ్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ నడిగర్‌ సంఘానికి లేఖ రాసింది మా అసోషియేషన్‌. వీలైనంత త్వరగా ఈ సమస్యకు సంబంధించి సరైన యాక్షన్‌ తీసుకుంటారని ఆశిస్తున్నామని లేఖలో పేర్కొంది. ‘మా’ అసోషియేషన్‌ తరపున జనరల్‌ సెక్రటరీ వీకే నరేష్‌ ఈ లేఖను నడిగర్‌ సంఘానికి పంపించారు.