HomeTelugu Trendingరామ్‌ సినిమాలో నటించడంపై మాధవన్‌ క్లారిటీ

రామ్‌ సినిమాలో నటించడంపై మాధవన్‌ క్లారిటీ

Madhavan clarity on rams mo

టాలీవుడ్‌ ఎనర్జిటిక్ హీరో రామ్, తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ మాస్ మసాలా చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కొవిడ్ ఉద్ధృతి తగ్గగానే షూటింగ్ మొదలుపెడతారు. ఇక ఈ సినిమాలో ప్రధాన విలన్ పాత్రకు మాధవన్‌ను తీసుకున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ వార్తలపై మాధవన్ స్పందించాడు. “వండర్ ఫుల్ దర్శకుడు లింగుస్వామి సినిమాలో నటించాలని నాకూ ఎంతగానో వుంది. అయితే ఆయన చేస్తున్న తెలుగు సినిమాలో నేను విలన్ గా నటిస్తున్నానంటూ వస్తున్న వార్తలలో మాత్రం వాస్తవం లేదు” అంటూ ట్వీట్ చేస్తూ క్లారిటీ ఇచ్చాడు మాధవన్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu