HomeTelugu Newsమధుర శ్రీధర్ తదుపరి చిత్రం 'ఎ ఫర్‌ అమెరికా'!

మధుర శ్రీధర్ తదుపరి చిత్రం ‘ఎ ఫర్‌ అమెరికా’!

దర్శకుడిగా, నిర్మాతగా విభిన్న చిత్రాల్ని రూపొందించిన మధుర శ్రీధర్‌రెడ్డి, ప్రస్తుతం ‘ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్‌ ఆఫ్‌ లేడీస్‌ టైలర్‌’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే. 30 ఏళ్ళ క్రితం రాజేంద్రప్రసాద్‌ హీరోగా సంచలన విజయాన్ని అందుకున్న ‘లేడీస్‌ టైలర్‌’ సినిమాకి ఇది సీక్వెల్‌. వంశీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

ఇదిలా ఉండగా, మధుర శ్రీధర్‌ మరో చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ‘ఎ ఫర్‌ అమెరికా’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సుజయ్ – సుశీల్‌ అనే దర్శక ద్వయం దర్శకత్వం వహించనుండడం గమనార్హం. సుజయ్- సుశీల్‌ చెప్పిన కథ తనకు బాగా నచ్చిందనీ, ఇదొక కాంటెంపరరీ అర్బన్‌ కామెడీ జోనర్‌లో ఉంటుందనీ, కథ వినగానే ఈ సినిమాని నిర్మించాలనే నిర్ణయానికి వచ్చానని మధుర శ్రీధర్‌రెడ్డి చెప్పారు. మరో ఔత్సాహిక నిర్మాత అప్పిరెడ్డితో కలిసి ఈ చిత్రాన్ని ఆయన నిర్మిస్తున్నారు. ‘ఎ ఫర్‌ అమెరికా’ సినిమా కోసం కొత్త నటీనటుల్ని తీసుకోవాలనుకుంటున్నారు. ఇందు కోసం ఔత్సాహికుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నారు. ఔత్సాహికులెవరైనా తమ ప్రొఫైల్స్‌ని పంపించవచ్చని మధుర శ్రీధర్‌రెడ్డి చెప్పారు. ఈ చిత్రానికి సునీల్‌ కాశ్యప్‌ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!