రెడ్డిగారికి నమ్మకం మాత్రం పోలేదు!

మల్లెల తీరంలో సిరిమల్లె చెట్టు వంటి క్లాసిక్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు రామరాజు. ఆ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ కాకపోయినా.. దర్శకుడిగా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. క్లాస్ ఆడియన్స్ ఆయనకు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా తరువాత కాస్త గ్యాప్ తీసుకొని నీహారిక కొణిదలను వెండితెరకు పరిచయం చేస్తూ.. ‘ఒకమనసు’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో డ్రామా ఎక్కువ కావడంతో రిజల్ట్ మరీ నీరసంగా తయారైంది. ఈ సినిమాను నిర్మించిన మధుర శ్రీధర్ రెడ్డికి నష్టాలు తప్పలేదు.
సాధారణంగా నిర్మాతలు ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి కలిసి పని చేయడానికి ఆలోచిస్తారు. కానీ మధుర శ్రీధర్ కు మాత్రం రామరాజు మీద నమ్మకం ఏ మాత్రం తగ్గలేదు. అందుకే మరోసారి ఆయనతో కలిసి సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సారి కూడా ఓ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమాకు ‘ప్రియురాలు’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.