HomeTelugu Trending'మహా సముద్రం' మోషన్‌ పోస్టర్‌

‘మహా సముద్రం’ మోషన్‌ పోస్టర్‌

Maha samudram motion poster

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్- సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘మహా సముద్రం’. ‘ఆర్‌ఎక్స్ 100’ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, రావు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే సినిమా షూటింగ్ ను పూర్తి చేసారు. ఇప్పుడు సినిమా ప్రమోషన్లపై దృష్టిని సారించారు. ఈ క్రమంలో తాజాగా ‘మహా సముద్రం’ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.

క్యారెక్టర్స్ ఇంట్రోకు సంబంధించిన ఈ వీడియోను అజయ్ భూపతి తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ ఉండగా… త్వరలోనే అప్డేట్స్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రం 2021 ఆగస్టు 19న థియేటర్స్‌లో విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu