HomeTelugu Trendingఇద్దరూ ఉండనీ.. బిగ్‌బాస్‌కు గంగవ్వ పంచ్‌..

ఇద్దరూ ఉండనీ.. బిగ్‌బాస్‌కు గంగవ్వ పంచ్‌..

Bigg boss 4 gangavva reacti
తెలుగు బిగ్ బాస్-4 షో నిన్న ప్రారంభం అయ్యింది. 16 మంది సభ్యులు బిగ్‌బాస్‌ ఇంటిలోకి ఎంటర్ ఇచ్చారు. వీరిలో జనాలనుకు తెలియని వారు కొందరుంటే తెలిసిన వారు కొందరున్నారు. వారిలో యూట్యూబ్ లో బాగా ఫేమస్ గంగవ్వ కూడా ఉంది. బిగ్‌బాస్ హౌస్ లోకి స్పెషల్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ. ఇక గంగవ్వ అమాయకత్వం , లోకం చదివిన అనుభవంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అర్ధమవుతుంది. మై విలేజ్‌ షోతో పాపులరైన గంగవ్వకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు దక్కుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న గంగవ్వ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎలా ఉండబోతుందో అన్నది ఆసక్తిగా మారింది. కాగా హౌస్ లో అప్పుడే నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు ఓ ప్రోమోను విడుదల చేశారు. ఇక ఇంటిసభ్యులు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి పేరు చెప్పి వారి మొహం మీద కిటీకి మూయాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. ప్రతి ఒకరు తమతమ అభిప్రాయం తెలుపగా చివరకు గంగవ్వ వంతు వచ్చింది. నామినేషన్ లో అభిజిత్ , దేతడి హారిక ఉండగా జోరుదర్ సుజాత, లాస్య ఎవరిని నామినేట్ చేస్తావ్ అని గంగవ్వను అడిగారు. ‘ఎవరినీ నామినేట్‌ చేయొద్దు. ఇద్దరూ ఉండనీ’ అని గంగవ్వ అనడంతో ఒక్కసారిగా హౌస్ లో నవ్వులు పూశాయి. మరి బిగ్‌బాస్‌ ఏ నిర్ణయం తీసుకుంటాడో ఈ రోజు రాత్రి 9.30 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu