HomeTelugu Big Storiesరివ్యూ: రాధ

రివ్యూ: రాధ

నటీనటులు: శర్వానంద్, లావణ్య త్రిపాఠి, రవి కిషన్, ఆశిష్ విధ్యార్ధి, తనికెళ్ళ భరణి తదితరులు
సంగీతం: ర‌ధ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీః కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని
ఎడిటింగ్ః కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
నిర్మాతః భోగ‌వ‌ల్లి బాపినీడు
ద‌ర్శ‌క‌త్వం: చంద్ర‌మోహ‌న్‌
శర్వానంద్ నుండి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా కొత్తగా ఉంటుందని ఆడియన్స్ ఆశిస్తారు. అతడు కూడా కథల విషయంలో చాలా చూజీగా ఉంటాడు. ఈ సారి ఫన్నీ పోలీస్ ఆఫీసర్ కథ ఎన్నుకొని ‘రాధ’ అంటూ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ:
చిన్నప్పటి నుండి పోలీస్ కావాలనుకున్న రాధాకృష్ణ(శర్వానంద్) అనుకున్నట్లుగానే పోలీస్ ఉద్యోగంలో చేరతాడు. వరంగల్ లో ఎస్.ఐ గా జాయిన అయిన రాధాకృష్ణ, రాధ(లావణ్యత్రిపాఠి) అనే అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. రాధ కూడా అతడిని ఇష్టపడుతుంది. ఈలోగా రాధాకృష్ణను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తారు. డ్యూటీలో జాయిన్ అయిన మొదటి రోజు నుండే క్రిమినల్స్ వెంట పడుతూ విధులను సక్రమంగా నిర్వర్తిస్తోన్న రాధాకృష్ణకు ఓ సమస్య సుజాత(రవికిషన్) రూపంలో
ఎదురవుతుంది. మినిస్టర్ అయిన సుజాత ముఖ్యమంత్రి పదవి కోసం అందరితో బుద్దిమంతుడిగా వ్యవహరిస్తాడు. మరి రాధ, సుజాత ఆగడాలను అరికట్టించాడా..? అసలు సుజాతకు, రాధాకృష్ణకు మధ్య వచ్చిన సమస్య ఏంటి..? సుజాత ముఖ్యమంత్రి అయ్యాడా..? అనే విషయాలతో సినిమా నడుస్తుంది.

ప్లస్ పాయింట్స్:
శర్వానంద్
కామెడీ
మైనస్ పాయింట్స్:
రొటీన్ కథ, కథనాలు
ఎడిటింగ్
లాజిక్స్ లేని సన్నివేశాలు

విశ్లేషణ:
హీరోకి విలన్ తో సమస్య రావడం వాడిని ఎదిరించడానికి విలన్ దగ్గరే హీరో ఉండడం, చివరకు విలన్ ను బకరా చేయడం. ఇటువంటి సీన్లు ఇప్పటికీ ఎన్ని సినిమాల్లో చూసి ఉంటాం. మళ్ళీ అదే రొటీన్ కమర్షియల్ ఫార్ములాను బేస్ చేసుకొని రాధ సినిమాను రూపొందించారు. అయితే రొటీన్ కథను కూడా ఎంటర్టైన్మెంట్ వే లో చెప్పాలనుకున్నారు. సో.. ఆడియన్స్ ఆ కామెడీను ఎంజాయ్ చేస్తారు. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్, కామెడీ సన్నివేశాలు అంతే. లవ్ ట్రాక్ కూడా పరమ రొటీన్. హీరో మాయ చేయడం దానికి హీరోయిన్ పడిపోవడం. లాజిక్స్ ను వెతకకూడదు. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ప్రేక్షకుల ఊహకు అందుతుంది.

శర్వానంద్ ఎప్పటిలానే తన పాత్రలో ఒదిగిపోయాడు. చాలా ఎనర్జీతో నటించాడు. తను చేసిన కామెడీ కూడా పండింది.
శర్వానంద్, సప్తగిరిల మధ్య వచ్చే సన్నివేశాలు ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. లావణ్యత్రిపాఠి సినిమాలో చాలా అందంగా కనిపించింది. రవికిషన్ తన పాత్రలో బాగా నటించాడు. కథ మొత్తం శర్వానంద్, రవికిషన్ ల చుట్టూనే తిరుగుతుంటుంది.

సినిమాలో పాటలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒకసారి వినొచ్చు. సినిమాటోగ్రఫీ వర్క్ కథకు తగ్గట్లుగా ఉంది. ఎడిటింగ్ వర్క్ బాలేదు. సినిమా మొత్తం ముక్కలు ముక్కలుగా ఉంది. తక్కువ బడ్జెట్ లోనే సినిమాను చిత్రీకరించారు. కాబట్టి నిర్మాత సేఫ్ జోన్ లో ఉన్నట్లే. శర్వాకు ఉన్న క్రేజ్ ను బట్టి సినిమా బడ్జెట్ ఈజీగా వచ్చేస్తుంది. డైరెక్టర్ అనుకున్న కథ, కథనాలు పాతవే అయినా.. తన కామెడీతో ఆడియన్స్ ను కొంతవరకు మెప్పించాడు.
రేటింగ్: 2/5

Recent Articles English

Gallery

Recent Articles Telugu