ఏడాది పూర్తి చేసుకున్న ‘మహానటి’


మే 9, 2018 వ తేదీన సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రం విడుదల అయ్యింది. నిన్నటికి సరిగ్గా రిలీజ్ అయ్యి సంవత్సరం అయ్యింది. సావిత్రి జీవిత కథ కాబట్టి ఆమె గురించి తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. దీంతో ఆ చిత్రాన్ని అందరు ఆదరించారు. సావిత్రి సినిమా జీవితమే కాకుండా ఆమె సోషల్ లైఫ్ ను కూడా చూపించడంతో ఆసక్తి పెరిగింది. ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకుంది.

సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయింది. జెమిని గణేశన్ గా దుల్క్యూర్ సల్మాన్ మెప్పించాడు. టాలీవుడ్ లోని చాలామంది ఈ సినిమాలో నటించడం విశేషం. నాగ్ అశ్విన్ సినిమాను తెరకెక్కించిన విధానం గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చైనాలోని షాంగై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపికైంది.

CLICK HERE!! For the aha Latest Updates