మహర్షికి U/A సర్టిఫికెట్

మహేష్ బాబు హీరోగా రూపొందిన మహర్షి మూవీ మే 9 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అటు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ టాక్ ప్రకారం సినిమా చాలా బాగా వచ్చిందని.. మహేష్ కెరీర్లోనే బెస్ట్ సినిమాగా నిలుస్తుందని తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు.