‘పాల పిట్ట’తో మహేశ్‌ కలర్‌ఫుల్‌ స్టెప్పులు!

‘పాల పిట్టలో వలపు.. నీ పైట మెట్టుపై వాలిందే..’ అంటూ స్టెప్పులేస్తున్నారు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. సినిమాలోని ‘పాల పిట్ట’ అనే పాటను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. వీడియోలో మహేశ్‌, పూజ వేసుకున్న దుస్తులు, స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. పాట చూడటానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. రాహుల్‌ సిప్లిగంజ్‌, ఎంఎం మానసి పాటను ఆలపించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమా సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. మే 9న ‘మహర్షి’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.