HomeTelugu Trending'సరిలేరు నీకెవ్వరు'లో మహేష్‌బాబు నేమ్‌ ప్లేట్‌.. వైరల్‌

‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్‌బాబు నేమ్‌ ప్లేట్‌.. వైరల్‌

7a 1సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తన తర్వాతి సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’లో మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో సందడి చేయబోతున్నారు. ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహేష్‌ పాత్రకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని అనిల్‌ బుధవారం వెల్లడించారు. సినిమాలో మేజర్‌గా మహేశ్‌ నేమ్‌ ప్లేట్‌ను చూపిస్తూ.. ఫొటోను షేర్‌ చేశారు. ‘సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కోసం మేజర్‌ అజయ్‌ కృష్ణగా మారారు. కశ్మీర్‌లో ఆపరేషన్‌ ప్రారంభమైంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల కాబోతోంది’ అని పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు దీన్ని తెగ షేర్‌ చేస్తున్నారు. ‘ఒక్కడు’లో మహేశ్‌ కబడ్డీ ఆటగాడు అజయ్‌గా, ‘దూకుడు’లో ఐపీఎస్‌ అజయ్‌ కుమార్‌గా సందడి చేశారు. ఈ రెండు సినిమాలు హిట్‌ అందుకున్నాయి. ఇప్పుడు మళ్లీ ఈ చిత్రం కోసం ఆయన అజయ్‌గా మారడం విశేషం.

ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. సీనియర్‌ నటి విజయశాంతి ఈ చిత్రం ద్వారా రీఎంట్రీ ఇవ్వనున్నారు. జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. అనిల్‌ సుంకర, దిల్‌రాజు, మహేష్‌బాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘ఎఫ్‌ 2’ తో అందరి మన్ననలు పొందిన అనిల్‌, మహేష్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం కావడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu