HomeTelugu Trendingవంశితో మహేష్‌ బాబు మూవీ..

వంశితో మహేష్‌ బాబు మూవీ..

2 4
సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు 26 వ సినిమా సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ వేగంగా జరుగుతున్నది. వచ్చే ఏడాది జనవరి 11 వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ సమయం దగ్గరికి వస్తుండటంతో ఒక్కొక్కటిగా అప్ డేట్స్ ను విడుదల చేస్తున్నారు. ప్రతి సోమవారం రోజున ఒక సాంగ్ రిలీజ్ చేసేందుకు యూనిట్ రెడీ చేసుకుంటోంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

మహేష్ బాబు నెక్స్ట్ సినిమా వంశి పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు వంశి కన్ఫర్మ్ చేశారు. ఫిబ్రవరి నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది. వచ్చే ఏడాది అక్టోబర్ లో దసరా సందర్భంగా విడుదల చేయాలని అనుకుంటున్నారట. గ్యాంగ్ స్టర్ లైఫ్ కు సంబంధించిన కథతో సినిమా తెరకెక్కబోతున్నటు తెలుస్తోంది. గతంలో మహేష్ బాబు గ్యాంగ్ స్టర్ సినిమాలు చాలా చేశారు. అతడు, పోకిరి, బిసినెస్ మెన్ వంటి సినిమాలు ఈ కోవలోకి వచ్చే సినిమాలే. అయితే గ్యాంగ్ స్టర్ లైఫ్ ఆధారంగా ఎప్పుడు మహేష్ సినిమాలు చేయలేదు. ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. గ్యాంగ్ స్టర్ లైఫ్ ఆధారంగా అంటే బయోపిక్ తీస్తారా లేదంటే ఇన్స్పిరేషన్ గా తీసుకొని సినిమా చేస్తారా చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu