HomeTelugu Trendingమహేష్ మరియు బన్నీ పిల్లల రాఖీ సెలబ్రేషన్స్

మహేష్ మరియు బన్నీ పిల్లల రాఖీ సెలబ్రేషన్స్

Mahesh and Bunny childrens

రాఖీ పండుగ సందర్భంగా సినీనటుడు మహేశ్ బాబు తన పిల్లల ఫొటోలను పోస్ట్ చేశారు. ఇంట్లో కార్పెట్ ఫై కూర్చొని గౌతం, సితార దిగిన ఫొటోను షేర్ చేశారు. శాశ్వతమైన ప్రేమ బంధం, రక్షణ, జాగ్రతలకు ప్రతీకైన ఈ పండుగను జరుపుకుంటున్నామని చెప్పారు. ‘రక్షాబంధన్ శుభాకాంక్షలు.. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి’ అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు. రాఖీ పండుగ సందర్భంగా సినీ ప్రముఖులు తమ అన్నా చెల్లెళ్లను గుర్తు చేసుకుంటున్నారు. ఇంట్లో జరుపుకుంటున్న పండుగ ఫొటోలను పోస్ట్ చేస్తూ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంట్లోనే ఉండి పండుగ చేసుకోవాలని పిలుపునిస్తున్నారు.

అలాగే అల్లు అర్జున్ పిల్లలు అర్హ, అయాన్‌ల ఫొటోలను బన్నీతోపాటు ఆయన భార్య స్నేహ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాఖీ పండగ సందర్భంగా బన్నీ కూతురు అర్హ తన సోదరుడు అయాన్‌కు రాఖీ కట్టింది. ఈ సందర్భంగా ఫొటోను పోస్టు చేస్తూ అభిమానులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. వీరి ఫొటోలు అభిమానులను అలరిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!