మహేష్ బాబు అభిమానులకు పండగ

 

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు పండగ లాంటి వార్త చెప్పారు. త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ మూవీ చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో అతడు, ఖలేజా చిత్రాలు తెరకెక్కాయి. 11 ఏళ్ల తర్వాత తాజాగా వీరిద్దరి కలయికలో మరో సినిమా ఖరారైంది. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని హారికా అండ్‌ హాసినీ బ్యానర్‌పై చినబాబు నిర్మిస్తున్నారు. అలవైకుంఠపురం విజయంతో త్రివిక్రమ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీతో మహేష్‌బాబు బిజీగా ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతితో సినిమా షూటింగా వాయిదా పడింది. వచ్చే జనవరిలో విడుదల చేయాలనుకుంటున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates