సిట్ పై రాజకీయ ఒత్తిడి.. వారికోసమేనా..?

ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో నిర్మాణ రంగంలో ఉన్న ఓ అగ్ర నిర్మాత తనయులిద్దరికి కూడా డ్రగ్స్ కేసులో సంబంధం ఉందని, వారికి నోటీసులు ఇవ్వడానికి సిట్ అధికారులు సిద్ధమవుతున్నారని తెలియగానే వారిపై రాజకీయ ఒత్తిడులు ప్రారంభమయ్యాయి. వీరికి నోటీసులు వద్దని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే నోటీసులు జారీ చేసి, ఆగస్ట్ 2న విచారణకు హాజరు కావాలని సిట్ భావిస్తోందట. అయితే వారి పేర్లు బయటకు వస్తే చిత్ర పరిశ్రమ మొత్తం అల్లకల్లోలం అవుతుందని ఆందోళన చెందుతున్నారు.

దీంతో తమ పరిచయాలు ఉపయోగించి రాజకీయ నాయకులతో ఫోన్లు చేయిస్తూ నోటీసులు పంపకుండా చేస్తున్నారని సమాచారం. రాజకీయ ఒత్తిడి లేకుంటే వారికి తప్పకుండా నోటీసులు జారీ చేస్తామని ఓ సిట్ అధికారి వెల్లడించారు. ఒత్తిడి పెరిగితే మాత్రం పై అధికారులు చెప్పినట్లు వినాల్సిందేనని మా చేతుల్లో ఏమీ లేదని ఆయన అన్నారు. వచ్చే వారం ఈ కేసులో మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయని అంచనా వేస్తున్నారు.