HomeTelugu Trendingమహేష్‌బాబు బర్త్‌డే స్పెషల్‌.. అభిమానులకు సర్‌ప్రైజ్‌

మహేష్‌బాబు బర్త్‌డే స్పెషల్‌.. అభిమానులకు సర్‌ప్రైజ్‌

1 8సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరూ’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ రోజు శుక్రవారం మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం సినిమాలోని మహేష్‌బాబు పాత్రను పరిచయం చేసింది. ఇందులో మహేష్‌ ఆర్మీ అధికారి మేజర్‌ అజయ్‌కృష్ణగా కనిపించనున్నారు. ‘సరిలేరు.. నీకెవ్వరూ..’ అంటూ వినిపించిన బ్యాగ్రౌండ్‌ సాంగ్‌ అభిమానులను అలరిస్తోంది.

శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ విజయశాంతి, నటుడు బండ్ల గణేష్‌లు ఈ చిత్రంతోనే మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేష్‌బాబులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu