HomeTelugu Trendingమహేష్‌ ఫ్యామిలీ ట్రిప్‌..

మహేష్‌ ఫ్యామిలీ ట్రిప్‌..

Mahesh babu family in air

టాలీవుడ్‌ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు తాజాగా సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. కొడుకు గౌత‌మ్‌, కూతురు సితార‌తో క‌లిసి విమానాశ్ర‌యంలో క‌నిపించాడు మ‌హేష్‌. క‌రోనాను దృష్టిలో పెట్టుకుని జాగ్ర‌త్త‌లు పాటిస్తూనే తిరిగి సాధారణ జీవ‌నం గ‌డిపేందుకు మ‌హేష్ ఫ్యామీలితో క‌లిసి విహార‌యాత్ర‌కు వెళ్తున్నారు. అందులో భాగంగా మ‌హేష్‌ కుటుంబం అంతా ఫేస్ మాస్కులు ధ‌రించి ఎయిర్‌పోర్ట్‌లో ద‌ర్శ‌నమిచ్చారు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్‌ పిల్ల‌ల‌తో దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అయితే వీరు విహారానికి అమెరికా వెళ్తున్న‌ట్లు స‌మాచారం. లాక్‌డౌన్ కారణంగా గత ఎనిమిది నెల‌లుగా బ‌య‌ట ప్ర‌దేశాల‌కు వెళ్ల‌కుండా ఇంటికే ప‌రిమిత‌మైంది మహేష్‌ కుటుంబం. ఇక త్వరలోనే “స‌ర్కారు వారి పాట” సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో మహేష్‌ ఈ చిన్న బ్రేక్‌లో పెద్ద‌ వినోదాన్ని ప్లాన్ చేశారు. అయితే హాలీడే ట్రిప్ ముగియ‌గానే సెట్స్‌లో అడుగుపెట్ట‌నున్నారు. ఇక “స‌ర్కారు వారి పాట” కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ప‌రశురామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu