HomeTelugu Big Stories'సర్కారువారి పాట' నుండి మహేశ్‌ బాబు ఫస్ట్‌లుక్‌

‘సర్కారువారి పాట’ నుండి మహేశ్‌ బాబు ఫస్ట్‌లుక్‌

Mahesh babu first look from
సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. తాజాగా ఈ చిత్రంలో నుంచి ఫస్ట్ లుక్‌ వచ్చేసింది. రెడ్‌ కలర్‌ కారులో నుంచి మహేశ్‌ బయటకు దిగుతున్నట్టుగా ఉన్న ఈలుక్‌ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ లుక్‌ ఫైట్‌ సీన్‌కి సంబంధించినది అని కారు అద్దాలు పగిలిన విధానాన్ని బట్టి అర్థమవుతోంది. ఇందులో మహేశ్‌ న్యూ హెయిర్‌ స్టైల్‌తో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

జీఎంబీ ఎంటర్టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లాస్‌, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన మరో ట్రీట్‌ కూడా సిద్ధం చేస్తున్నారు మేకర్స్‌. మహేశ్‌ బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 9న `సూపర్‌స్టార్‌ బర్త్ డే బ్లాస్టర్‌` పేరుతో మరో గిఫ్ట్ ఇవ్వనున్నారు. బ్యాంకు కుంభకోణం నేపథ్‌యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రానికి పరశురామ్‌ దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. తమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu