కామెడీ ప్రధానంగా ‘ఉంగరాల రాంబాబు’!

సునీల్ హీరోగా, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపోందుతున్న‌ చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. ప్ర‌స్తుతం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. పరుచూరి కిరీటి యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విలువ‌ల‌తో కూడిన వాణిజ్య‌ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్న ఉంగరాల రాంబాబు చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి మే నెల‌లో విడుద‌ల చేయ‌నున్నారు. అతిత్వ‌ర‌లోనే జిబ్రాన్ అందించిన ఆడియో విడుద‌ల చేస్తారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. ”ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో సునీల్ న‌టించిన అందాల‌రాముడు త‌రహా న‌వ్వించే చిత్రంగా తెలుగు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందుతుంది. ఈ సంవ‌త్స‌రం స‌మ్మ‌ర్ లో ఫ్యామిలి ఆడియ‌న్స్ ని క‌డుపుబ్బ న‌వ్వించే మెట్ట‌మెద‌టి చిత్రంగా మా ఉంగ‌రాల రాంబాబు వుంటాడనేది మా న‌మ్మ‌కం. త్వ‌ర‌లో మేము విడుద‌ల చేస్తున్న విజువ‌ల్స్ చూస్తే ఎంట‌ర్‌టైన్‌మెంట్ ని ఏ రేంజిలో తెర‌కెక్కించామ‌నేది తెలుస్తుంది. మా చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. న‌వ్వించ‌మే ద్యేయంగా అది కూడా అవుటాఫ్ కామెడి కాకుండా క‌థ‌లోని కామెడి ని పొందు ప‌ర‌చి న‌వ్విస్తాము” అని అన్నారు.