తన దర్శకులందరికీ ఆహ్వానం పలుకుతున్న మహేష్‌

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు చేస్తున్న 25వ సినమా ‘మహర్షి’. తాజాగా షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం .. మే 9వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇది తన సిల్వర్ జూబ్లీ చిత్రం కావడంతో మహేష్ బాబు పాట గత 24 చిత్రాల దర్శకులందరినీ ఈ వేడుకకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్విని దత్, పివిపి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో మహేష్ బాబుకు జోడీగా పూజ హెగ్డే కనిపించనుంది. అల్లరి నరేష్‌ ప్రధాన పాత్ర పోషించారు.