HomeTelugu Trendingత్రివిక్రమ్‌తో ఎన్టీఆర్‌ సినిమా!

త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్‌ సినిమా!

8 17
రాజమౌళి నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఈ సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన వెట్రిమారన్ దర్శకత్వంలోగానీ, త్రివిక్రమ్ దర్శకత్వంలోగాని చేసే అవకాశాలు వున్నట్టుగా వార్తలు వచ్చాయి. ముందుగా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే ఎన్టీఆర్ చేయనున్నట్టు సమాచారం. ‘అరవింద సమేత’లో ఎన్టీఆర్ ను కొత్త కోణంలో చూపించిన త్రివిక్రమ్, ఈ సినిమాలో ఆయనను పక్కింటి అబ్బాయి పాత్రలో చూపించనున్నాడని అంటున్నారు.

ఫ్యామిలీ డ్రామాకి సంబంధించిన ఈ కథపైనే త్రివిక్రమ్ కసరత్తు మొదలుపెట్టాడని చెబుతున్నారు. జూన్ నుంచి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని అంటున్నారు. హారిక అండ్ హాసినివారితో కలిసి ఈ సినిమాను నిర్మించడానికి, కల్యాణ్ రామ్ అంగీకరించాడని సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu