HomeTelugu Big Storiesమే 31న మహేష్‌బాబు ట్రిపుల్ ధమాకా

మే 31న మహేష్‌బాబు ట్రిపుల్ ధమాకా

Mahesh Babu movies updates
మే 31న సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహేశ్ బాబు మూవీస్‌కు సంబంధించిన ట్రిపుల్ ధమాకా రాబోతుందట. మే 31న ‘సర్కారు వారి పాట’ మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియో, ఫస్ట్ లుక్ విడుదల అవుతుందట. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఇందులో మహేష్ బాబు సరసన కీర్తిసురేష్ నటించింది. ఈ సినిమా కొంత భాగం దుబాయ్‌లో షూటింగ్ చేశారు. మహేశ్ బాబు నెక్స్ట్ ప్రాజెక్టు త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ టైటిల్ కూడా మే 31న రివీల్ చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమాకు తివ్రికమ్ ‘అతడే పార్థు’ టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అనిల్ రావిపూడి మహేశ్‌తో రెండో సినిమా చేస్తాడని అంటున్నారు. దీనికి సంబంధించిన అప్‌డేట్ కూడా మే 31న విడుదలయ్యే అవకాశం ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu