పవన్ ను చూశాక మాటలు రాలేదు!

పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు టైటిల్ గా ‘అజ్ఞాతవాసి’ అనే పేరును పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా అనుతో పాటు కీర్తి సురేష్ కూడా కనిపించనుంది. అయితే ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చిందనే విషయంపై అను ఎమ్మాన్యూయల్ మాట్లాడుతూ.. 
 
‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నుండి ఫోన్ వచ్చింది. పవన్ తో మీరు సినిమా చేయాలి అన్నారు. వెంటనే వారిని మీట్ అవ్వడానికి వెళ్ళాను. మొదట పవన్ కు చెల్లెలి రోల్ ఇస్తారేమో అనుకున్నా.. కానీ హీరోయిన్ పాత్ర దక్కింది. సినిమా సెట్ లో మొదటిరోజు పవన్ ను చూసినప్పుడు భయపడ్డాను. చెప్పాల్సిన డైలాగులు ముందు రోజే బట్టీ పట్టాను. కానీ సెట్ లో పవన్ ను చూడగానే అన్నీ మర్చిపోయాను. పవన్ మాత్రం చాలా సరదాగా ఉంటారు. ఆయనతో కలిసి నటించడం మంచి అనుభవం అంటూ చెప్పుకొచ్చింది.