HomeTelugu Big Storiesబర్త్‌ డే బాయ్‌ న్యూలుక్‌.. వైరల్‌

బర్త్‌ డే బాయ్‌ న్యూలుక్‌.. వైరల్‌

Mahesh Babu New Look Viral

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో సందడి మొదలైంది. ఆయన అభిమానులు మహేశ్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ.. శుభాకాంక్షలు చెప్పడం మొదలు పెట్టారు. తాజాగా మహేశ్‌బాబుకు సంబంధించిన న్యూ ఫొటో సోషల్‌ వైరల్‌ అవుతుంది. ఈ ఫొటో లో మహేష్‌ స్టైలిష్‌ లుక్‌లో ఆకట్టుకుంటుంది. ఫార్మల్‌ ఔట్‌ఫిట్‌లో స్టైల్‌కే బాస్‌లాగా, మ‌రింత యంగ్‌గా కనిపిస్తున్నారు. ‘మరొక సరదా ఫొటో షూట్‌’ అంటూ అవినాష్‌ గోవర్కర్‌ తీసిన ఈ ఫొటోను మహేశ్‌ ట్విటర్‌లో పంచుకున్నారు.

ప్రస్తుతం మహేష్‌ బాబు పరుశురామ్‌ డైరెక్షన్‌లో ‘సర్కారు వారి పాట’లో నటిస్తున్నారు. సోమవారం మహేశ్‌ బ‌ర్త్‌డే సందర్భంగా చిత్ర బృందం మరో సర్‌ప్రైజ్‌ను అభిమానులకు ఇవ్వనుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్స్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌వి శంక‌ర్‌, రామ్ ఆచంట గోపీ ఆచంట నిర్మిస్తోన్న ‘స‌ర్కారువారి పాట‌’ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. సంక్రాంత్రి కానుకగా జనవరి 13, 2022లో ఈ సినిమా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu