HomeTelugu Big Stories'నాంది' ట్రైలర్‌ విడుదల చేసిన మహేష్‌ బాబు

‘నాంది’ ట్రైలర్‌ విడుదల చేసిన మహేష్‌ బాబు

Trailer of Naandhi is filled with gritty drama

అల్లరి నరేష్‌ నటించిన తాజా చిత్రం ‘నాంది’ . ఇప్పటి వరకు కామెడీ సినిమాలతో అలరించిన నరేష్‌ తొలిసారి డిఫ‌రెంట్ స్టోరీతో వస్తున్నాడు. ఈ సినిమాలో క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక అంశాల మంచి సందేశం ఇచ్చే విధంగా ఉంటుందని తెలుస్తోంది. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని స‌తీశ్ వేగేశ్న నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో ‘నాంది’ ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని, సినిమా బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అవ్వాలని అల్లరి నరేష్‌, చిత్రయూనిట్‌కు విషెస్‌ తెలియజేశారు. ఇక ట్రైలర్‌లో.. అల్లరి నరేష్‌ చేయని నేరానికి జైలుకి వెళ్లినట్లు తెలుస్తోంది. నరేష్‌ నిజంగానే హత్య చేశాడా లేక కావాలని అతన్ని ఇరికించారా అనేది కథలోని అంశం. ఇక ఈ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ లాయ‌ర్‌గా క‌నిపించారు. ఫిబ్ర‌వ‌రి 19న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చిత్రబృందం ప్రకటించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu