ఈసారి మిలియన్ పక్కా!

రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా నానికి మంచి క్రేజ్ ఉంది. అతడు తాజాగా నటించిన ‘నిన్ను కోరి’ సినిమాకు దాదాపు 500 వందల ప్రీమియర్స్ పడ్డాయంటే అతడి ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో తెలుస్తోంది. వాస్తవానికి స్టార్ హీరోల సినిమాలకు లేని ఊపు నాని సినిమాలకు అక్కడ ఉంటుంది. ఒక్క ప్రీమియర్లతో సినిమా 1.6 లక్షల డాలర్లు రాబట్టింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, అక్కడ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉండడంతో వసూళ్ల పరంగా ఈ సినిమా పెద్ద నంబర్లు చూపించడం ఖాయమని భావిస్తున్నారు. 6 నుండి 7 లక్షల డాలర్ల మధ్య వీకెండ్ వసూళ్లు ఉంటాయని భావిస్తున్నారు. 
ఫుల్ రన్ లో సినిమా మిలియన్ మార్క్ ను చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ‘భలే భలే మగాడివోయ్’ సినిమా ఓవర్సీస్ లో 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఆ తరువాత విడుదలైన నాని సినిమాలు అన్నీ కూడా ఆ మార్క్ ను చేరుకునే ప్రయత్నం చేశాయి. కానీ చేరుకోలేకపోయాయి. ‘నిన్ను కోరి’ సినిమా ఖచ్చితంగా మిలియన్ మార్క్ అందుకుంటుందని భావిస్తున్నారు. పూర్తి క్లాస్ టచ్ ఉన్న సినిమా కావడంతో మాస్ ఆడియన్స్ ఆదరణ కాస్త తక్కువగా ఉంటుందనే చెప్పాలి. కానీ ఏ సెంటర్స్ లో మాత్రం మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.