HomeTelugu Trendingఫ్యాన్స్‌కు మహేష్‌ లేఖ

ఫ్యాన్స్‌కు మహేష్‌ లేఖ

Mahesh babu requests letter

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌తో సోషల్‌ మీడియాను షేక్‌ చేసిన యూనిట్‌ నేడు ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరపబోతోంది. ఈ క్రమంలో మహేశ్‌బాబు ఫ్యాన్స్‌ కోసం ఓ లేఖ వదిలాడు.

లేఖలో ఏముందంటే… ‘సర్కారువారి పాట షూటింగ్‌ పూర్తయి, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 12న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. ఎన్నో అంచనాలతో, ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న మన సర్కారువారి పాట చిత్రం థియేటర్లలోనే చూసి మీ స్పందన తెలియజేయగలరు’ అని రాసి ఉంది. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఎస్‌ రాధాకృష్ణ నిర్మించే చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జూన్‌లో మొదలవుతుందని తన సినిమా అప్‌డేట్‌ కూడా చెప్పేశాడు మహేశ్‌. మొత్తానికి ఫ్యాన్స్‌ను తన సినిమా థియేటర్లలోనే చూడండని చెప్తూనే కొత్త సినిమా షూటింగ్‌ కూడా త్వరలోనే ఉందని గుడ్‌న్యూస్‌ చెప్పాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!