HomeTelugu Newsమరో వ్యాపారం మొదలెట్టిన మహేష్‌బాబు!

మరో వ్యాపారం మొదలెట్టిన మహేష్‌బాబు!

13 6
టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటు హీరోగా అటు బిజినెస్ మెన్ గా దుసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే థియటర్స్ రంగంలోకి అడుగుపెట్టిన మహేష్ హైదరాబాద్ లో ఏ.ఎంబీ మాల్ ను ప్రారంభించాడు. త్వరలోనే బెంగుళూర్‌లో కూడా ఓ మాల్ ను ఏర్పాటు చేయనున్నాడు. అదే విధంగా విశాఖపట్టణం లో కూడా ఓ మాల్ ను నిర్మించనున్నాడు ఈ హీరో. ఇదిలా ఉంటే మహేష్ ఇప్పటికే ఒక వస్త్ర శ్రేణి వ్యాపారం కూడా నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ సంస్థను ఇండియాలోని ప్రముఖ బ్రాండ్ తో టై అప్ అయినా విషయం తెలిసిందే.

మరోవైపు సొంతగా పలు బ్రాండ్లకు ప్రచారం చేస్తున్నాడు సూపర్‌స్టార్‌. ఇదిలా ఉంటే త్వరలో మహేష్ మరో బిజినెస్ లోకి అడుగు పెడుతున్నాడని తెలుస్తుంది. త్వరలోనే ఎంబీ లోగోతో పెర్ఫ్యూమ్ బ్రాండ్‌ని కూడా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu