HomeTelugu Trendingఆలోచింప చేసేవిధంగా మహేష్ ట్వీట్‌..

ఆలోచింప చేసేవిధంగా మహేష్ ట్వీట్‌..

8 19టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఒక స్టార్ గా సినిమా విషయంలో ఎంత డేడికేట్ గా పనిచేస్తాడో.. కుటుంబం విషయంలోనూ అంతే డెడికేషన్ తో ఉంటాడు. ఇంకా చెప్పాలంటే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాడు. ఏ కొద్దిసమయం దొరికినా.. మిగతా వారిలా వేరే వ్యక్తులతో కాలక్షేపం చేయకుండా.. కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు ఆసక్తి చూపుతాడు మహేష్. కుటుంబంతో కలిసి ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటాడు.

మనదేశంలో మహిళలపై వివక్ష ఎక్కువగా ఉన్నది. ఈ వివక్షను పోగొట్టడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు అందులో ఆడపిల్లల విషయంలో ఈ వివక్ష ఎక్కువ. ఈ వివక్షను పోగొట్టాలని, సోషల్ మీడియా ద్వారా ఈ విషయంలో అందరిలో మార్పు వచ్చేలా చేయాలని మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. ఆలోచింప చేసేవిధంగా ఉన్న ఈ సందేశం.. అందరిని ఆకట్టుకుంటోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu