HomeTelugu Trendingమహేష్‌ బాబు అల్ట్రా స్టైలిష్‌ లుక్‌ వైరల్‌

మహేష్‌ బాబు అల్ట్రా స్టైలిష్‌ లుక్‌ వైరల్‌

Mahesh babu ultra stylish s

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’.ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. తాజాగా ఫోటోషూట్‌లో మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్‌గా కనిపించాడు. ఆ పిక్ లో నల్ల ట్రౌజర్, ముదురు రంగు జాకెట్ ధరించి కనిపించాడు. ఆయన మోటర్‌ బైక్‌పై కూర్చుని మొబైల్ ఫోన్ పట్టుకుని ఉన్నాడు. ఇటీవల “సర్కారు వారి పాట” కోసం మార్చుకున్న హెయిర్‌స్టైల్‌ ను అలాగే మైంటైన్ చేస్తున్నాడు.

మహేష్ బాబు న్యూలుక్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. హాలీవుడ్ యాక్షన్ హీరోలకు ఏమాత్రం తీసిపోని అందంలో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు. మహేష్‌ నటిస్తున్న‘సర్కారు వారి పాట’లో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం బ్యాంకింగ్ రంగంలో ఆర్థిక స్కామ్‌ల చుట్టూ తిరుగుతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu