HomeTelugu Big Storiesతల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మహేష్‌ బాబు

తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మహేష్‌ బాబు

Mahesh babu wishes his moth

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి పుట్టినరోజు ఈ రోజు (ఏప్రిల్ 20). కన్నతల్లి పుట్టినరోజు సందర్భంగా మహేష్ తన తల్లితో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేగాక ‘హ్యాపీ బర్త్ డే అమ్మ.. ప్రతిరోజూ మీకు గొప్పగా ఉండాలి’ అని కోరుకుంటూ అపురూపమైన తన తల్లి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి ఏప్రిల్ 20వ తేదీన పుట్టినరోజు జరుపుకుంటోంది. తల్లికి శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ రోజు నా జీవితంలో కూడా గొప్పరోజు అంటూ ఇదివరకే తెలిపాడు.

ఇందిరాదేవి గారికి సూపర్ స్టార్ కృష్ణతో 1961లో పెళ్లైంది. వీరికి ఇద్దరు కొడుకులు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కొడుకు రమేశ్ బాబు కొన్ని సినిమాల్లో నటించి ఇండస్ట్రీ నుండి దూరంగా ఉంటున్నారు. చిన్నకొడుకైన మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్ గా స్టార్‌ హీరోలలో ఒకరిగా రాణిస్తున్నాడు. అయితే మహేష్ తో పాటు ఆయన భార్య నమ్రత శిరోద్కర్ కూడా ఇందిరాదేవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu