HomeTelugu Trendingనా స్వీట్‌ లవ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు: మహేష్‌ బాబు

నా స్వీట్‌ లవ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు: మహేష్‌ బాబు

3 23ప్రముఖ నటుడు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు తన సతీమణి నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. నమ్రత మంగళవారం తన పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా మహేష్ తన ప్రియమైన సతీమణికి సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ఆమెతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు. ‘నా స్వీట్‌ లవ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీకు ధన్యవాదాలు. నా కోసం నువ్వు చేసిన ప్రతి పనికీ, చూపిన ప్రేమకు లవ్‌ యు’ అని ట్వీట్‌ చేశారు. నమ్రత ఫెమినా మిస్‌ ఇండియాగా 1993లో కిరీటం గెలుచుకున్నారు. తర్వాత అనేక సినిమాల్లో నటించారు. మహేష్‌ తో పెళ్లి తర్వాత ఆమె నటనకు దూరమయ్యారు.

కాగా మహేష్‌ బాబు ప్రస్తుతం ‘మహర్షి’ మూవీలో నటిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌. వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu