HomeTelugu Big Storiesవెళ్లి ప్రపంచాన్ని జయించు.. గౌతమ్‌కు మహేష్‌ బర్త్‌డే విషెస్‌

వెళ్లి ప్రపంచాన్ని జయించు.. గౌతమ్‌కు మహేష్‌ బర్త్‌డే విషెస్‌

Mahesh babu wishing gautam
సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, నమ్రతల ముద్దుల తనయుడు గౌతమ్‌ ఘట్టమనేని నేడు(ఆగస్ట్‌ 31) 15వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గౌతమ్‌కు సినీ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మహేశ్‌ బాబు, నమ్రతలు కూడా తమ లిటిల్‌ ప్రిన్స్‌పై ప్రేమను వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్‌ తెలియజేశారు.

“హ్యాపీ 15 మై సన్ !! నువ్వు ఎదగడం చూస్తుంటే ఆనందంగా ఉంది. ఎప్పుడూ నీకు మంచే జరగాలని కోరుకుంటున్నాను! వెళ్లి ప్రపంచాన్ని జయించు… లవ్ యు జిజి” అంటూ మహేశ్‌ ట్వీట్ చేశారు.. ఇక నమ్రత కూడా ఇన్‌స్టా వేదికగా తమ కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. గౌతమ్‌ ఫొటోని షేర్‌ చేసింది.

ఇ​క​ గౌతమ్‌.. మహేశ్‌ బాబు హీరోగా నటించిన వన్‌- నేనొక్కడినే సినిమాతో బాల నటుడిగా నటించిన సంగతి తెలిసిందే. అప్పుడు గౌతమ్‌కు కేవలం 8 సంవత్సరాల వయస్సు మాత్రమే. 2018లో ప్రొఫెషనల్ స్విమ్మింగ్ నేర్చుకోవడం ప్రారంభించిన గౌతమ్.. తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్‌లోని టాప్ 8 ఈతగాళ్లలో స్థానం దక్కించుకున్నాడు. ఈతలోని నాలుగు విధానాల్లో గౌతమ్ అద్భుతంగా ఈదగలడు. ప్రస్తుతం స్టడీస్‌తో పాటు తనకిష్టమైన స్పోర్ట్స్‌లోనూ రాణిస్తున్న గౌతమ్ త్వరలో హీరోగా ఎంట్రీ కోసం సూపర్ స్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu